మరో పది రోజుల్లో రోడ్డెక్కనున్న బస్సు..

మరో పది రోజుల్లో రోడ్డెక్కనున్న బస్సు..
X

లాక్డౌన్ అమలులో ఉన్న కారణంగా దాదాపు అన్ని రవాణా సర్వీసులు నిలిచిపోయాయి. కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతుండడంతో దేశంలోని చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్ సడలించింది. దీంతో కొన్ని నిబంధనలకు కట్టుబడి.. ఈ నెల 17నుంచి 50 శాతం బస్సుల్ని రోడ్లమీదకు తీసుకురావాలని నిర్ణయించింది తమిళనాడు రవాణాశాఖ. ఈ మేరకు ఆయా విభాగాల మేనేజర్లకు రవాణాకార్యదర్శి ధర్మేంద్ర ప్రతాప్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు. కరోనాను దృష్టిలో ఉంచుకుని సామాజిక దూరాన్ని పాటిస్తూ, మాస్కులు ధరించి ప్రయాణించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. రవాణా వ్యవస్థ లేక ఎక్కడి వారు అక్కడ నిలిచిపోయారు. ఇప్పుడు వాళ్లందరికీ ఇది ఊరటనిచ్చే వార్త.

Next Story

RELATED STORIES