గ్యాస్ లీక్ ఘటనతో ప్రభుత్వ బాధ్యతారాహిత్యం బయటపడింది: చంద్రబాబు

X
TV5 Telugu8 May 2020 7:11 PM GMT
విశాఖ గ్యాస్ లీక్ ఘటనతో ప్రభుత్వ బాధ్యతారాహిత్యం బయటపడిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఎలాంటి అవగాహన లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని.. కనీసం 10 మందితో చర్చించి నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదన్నారు బాబు. ప్రమాద తీవ్రతపై ప్రధాని మోదీ, HRC, NGT, హైకోర్టు ఎందుకు స్పందించారో అర్థం చేసుకోవాలన్నారు. ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని చంద్రబాబు హెచ్చరించారు. కరోనా సమయంలోనూ ఇలాంటి నిర్లక్ష్యమే ప్రదర్శించారని... టాబ్లెట్‌లు, బ్లీచింగ్ పౌడర్ వేస్తే సరిపోతుందని సీఎం జగన్ చెప్పిన విషయాలను బాబు ప్రస్తావించారు.
Next Story