కరోనా పేషెంట్లకు రోబో సేవలు

కరోనా పేషెంట్ల దగ్గరకు వెళ్లకుండానే వారికి కావాల్సిన సేవలను అందించేలా రోబోను తయారు చేశారు తెలుగు శాస్త్రవేత్త పవన్. రోబోను వంద మీటర్ల దూరం వరకు రిమోట్ తో ఆపరేట్ చేసేలా రూపొందించారు. దీంతో ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది పేషెంట్ దగ్గరికి వెళ్లకుండా మందులు ఇవ్వొచ్చు. రోగికి ఆహారం కూడా రోబో ద్వారా అందించవచ్చు. కరోనా పేషెంట్లకు చికిత్స చేస్తూ వైద్య సిబ్బంది కూడా వైరస్ బారిన పడుతుండటంతో ఈ రోబో సేవలు ఎంతో ప్రయోజనకరంగా ఉండనున్నాయి.
చిత్తూరు జిల్లా పలమనేరు మండలం, మొరం గ్రామానికి చెందిన సైంటిస్ట్ పవన్..ఈ రోబోను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే అన్ని ఐసోలేషన్ సెంటర్లలో రోబో సేవలను వినియోగించుకోవటం ద్వారా కరోనా కట్టడి చేయొచ్చని పవన్ అంటున్నారు. వైద్యసిబ్బంది వైరస్ బారిన పడకుండా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com