జులైలో పది పరీక్షలు

జులైలో పది పరీక్షలు
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదవ తరగతి విద్యార్ధులకు ఫైనల్ పరీక్షలను జులై నెలలో నిర్వహిస్తామని మంత్రి ఆది మూలపు సురేష చెప్పారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పరీక్షలకు సంబంధించిన షెడ్యూ‌ల్‌ను త్వరలో విడుదల చేస్తామని మంత్రి చెప్పారు. పరిక్షల సమయంలో విద్యార్థులు తప్పని సరిగా మాస్కులు ధరించేలా చూడ్డంతో పాటు, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. విద్యార్థులు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా పరిక్షల నిర్వహణ సక్రమంగా జరిగేలా చూస్తామని అన్నారు.

Next Story

RELATED STORIES