ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
X

పాకాల మండలం గుండ్లగుట్టపల్లె సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం మధ్యాహ్నం జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు జిల్లా పెరియకోయిలంబాకం భజన కోవిల్ వీధికి చెందిన టిప్పర్ డ్రైవర్లు మణిబాలన్ వేలాయుధం, వేణు రంగనాధన్, రామకుమార్ గోపాల్.. తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట జిల్లాలో జరిగే మల్లన్న సాగర్ రిజర్వాయరు పనులు చేయడానికి ప్రభుత్వ అనుమతులతో బయలుదేరారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా గుండ్లగుట్టపల్లె వద్ద వేగంగా వెళ్తున్న వీరి కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న మామిడి తోటలోకి 30 మీటర్ల వరకు దూసుకెళ్లి బండరాళ్లను ఢీకొని బోల్తాపడింది. దాంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మణికందన్ అనే మరో వ్యక్తి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. ప్రమాద స్థలాన్ని ట్రైనీ డీఎస్పీ యశ్వంత్, ఎస్‌ఐ రాజశేఖర్ పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

RELATED STORIES