ప్రపంచవ్యాప్తంగా 4.2 మిలియన్లు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు

ప్రపంచవ్యాప్తంగా 4.2 మిలియన్లు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు

ప్రపంచ మనుగడను సవాల్‌ చేస్తున్న కరోనా మహమ్మారి.. అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 42 లక్షల 50 వేలు దాటాయి. దీని బారినపడి మరణంచిన వారి సంఖ్య 2 లక్షల 87 వేలు దాటిపోయింది. ఈ వ్యాధి నుంచి 15 లక్షల మంది రికవర్ కాగా.. 47 వేల మంది కండిషన్‌ సీరియస్‌ లేదా క్రిటికల్‌గా ఉంది. వ్యాధి తీవ్రతలో అమెరికాలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసులు 13 లక్షల 85 వేలు దాటగ.. దాదాపు 82 వేల మంది మృత్యువాతపడ్డారు. స్పెయిన్‌లో పాజిటివ్ కేసులు 2 లక్షల 68 వేలు దాటగా.. దాదాపు 27 వేల మంది చనిపోయారు. యూకే 2 లక్షల 23 వేల మందికి కరోనా బారిన పడగా... మృతుల సంఖ్య 32 వేలకు చేరుకుంది.

Tags

Read MoreRead Less
Next Story