కరోనా ఎఫెక్ట్: పశ్చిమ బెంగాల్‌లో అధికారుల బదిలీలు

కరోనా ఎఫెక్ట్: పశ్చిమ బెంగాల్‌లో అధికారుల బదిలీలు

దేశం మొత్తం కరోనా ప్రభావం ఒకలా ఉంటే.. పశ్చిమ బెంగాల్ లో మాత్రం కరోనా ప్రభావంతో బదిలీలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా కేంద్రంగా బెంగాలో నిన్న, మొన్నటి వరకూ రాజకీయం వేడెక్కింది. కేంద్ర బృందం బెంగాలో పలు ప్రాంతాల్లో పర్యటిచండంతో మమత ప్రభుత్వం తీవ్రంగా మండిపడింది. దీనికి కౌంటర్ గా బెంగాల్ గవర్నర్ కూడా ఘాటుగా లేఖలు రాసి.. మమత ప్రభుత్వాన్ని విమర్శించారు. తరువాత.. కరోనా వివరాలు వెల్లడించడంలో రాష్ట్రం ప్రభుత్వం ఫెయిల్ అయిందని.. తప్పుడు లెక్కలు చూపిస్తుందని బీజేపీ తీవ్రంగా విమర్శించింది. ఇప్పుడు ఇవ్వన్ని.. పక్కకుపోయి.. అధికారుల బదిలీలు తెరపైకి వస్తున్నాయి. కరోనా కట్టడిలో ఫెయిల్ అయ్యారని.. బెంగాల్ ప్రభుత్వం ఆరోగ్య కార్యదర్శి వివేక్ కుమార్ ను రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ శాఖకు బదిలీ చేసింది. అటు, రవాణా శాఖ కార్యదర్శిగా ఉన్న నారాయణ స్వరూప్ నిగమ్ ను ఆరోగ్య శాఖ కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. ఇటీవల ఆహారశాఖ కార్యదర్శి మనోజ్ కుమార్ ను కూడా తొలగించిన విషయం తెలిసిందే. దీంతో.. బీజేపీ మమత సర్కార్ పై విమర్శలు గుప్పిస్తుంది. కరోనా కట్టడి కాకపోవడానికి ఆరోగ్యశాఖ కార్యదర్శిని కారణంగా చూపిస్తూ.. ఆయనను తొలగించడం సరికాదని.. ఆరోగ్యమంత్రిని తొలగించగలరా అని బీజేపీ ప్రశ్నించింది.

Tags

Read MoreRead Less
Next Story