కరోనాతో వార్‌కు ఒక రోబో రెడీ

కరోనాతో వార్‌కు ఒక రోబో రెడీ

కరోనాతో వార్‌కు ఒక రోబో రెడీ అయింది. నీటి బిందువులను బుల్లెట్లుగా మార్చి వైరస్‌తో యుద్ధం చేస్తోంది. ఆ నీటి బిందువులు చాలా పవర్‌ఫుల్. కరోనా వైరస్‌లోని ప్రొటీన్‌ను ఇవి చీల్చి చెండాడుతాయి. ఈ దెబ్బకు వైరస్ చచ్చిపోతుంది.

కరోనాతో పోరాడే రోబో పేరు ఎయిర్‌లెన్స్ మైనస్ కరోనా. దీన్ని ఢిల్లీకి చెందిన ఐఐటీ, అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు కలిసి తయారు చేశారు. కొవిడ్‌-19పై పోరులో ఇది అద్భుతంగా పనిచేస్తున్నట్లు యువ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రోబోను హాస్పిటల్స్, బస్టాప్‌లు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ వంటి రద్దీ ప్రాంతాలతోపాటు రోడ్లపై స్ప్రే చేయడానికి వినియోగిస్తున్నారు.

ఈ రోబో రేణువుల విద్యుదీకరణ అనే ఫార్ములా ఆధారంగా పనిచేస్తుంది. దీని నుంచి వచ్చే అయనైజ్డ్ నీటి బిందువులు.. ఆక్సీకరణ ద్వారా వైరస్‌లోని ప్రొటీన్లను చంపేస్తాయి. ఫలితంగా ఖతర్నాక్ కరోనా వైరస్‌లు నీరుగారిపోతాయి. ఆక్సీకరణ అనేది సూక్ష్మజీవులను నిర్మూలించే అత్యంత సమర్థవంతమైన విధానం. అయితే ఈ రోబోలో అతినీలలోహిత కిరణాలుగానీ, రసాయనాలుగానీ వినియోగించరు. అందుకే దీని వల్ల మనుషుల చర్మంపై ఎలాంటి దుష్ప్రభావం ఉండదని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story