ఈ టాబ్లెట్ వేసుకుంటే వైరస్ వ్యాప్తి కొంతవరకైనా..

ఈ టాబ్లెట్ వేసుకుంటే వైరస్ వ్యాప్తి కొంతవరకైనా..

వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అమెరికన్ సైంటిస్టులు ఓ కొత్తరకం టాబ్లెట్ కనిపెట్టారు. అది వేసుకుని బయటకు వెళ్తే తుమ్మినా, దగ్గినా తుంపర్లు ఎదుటి వాళ్ల మీద పడకుండా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. కరోనా మనతోపాటే జీవిస్తుంది. ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవడం తప్పించి ఏమీ చేయలేని పరిస్థితి. ఎన్ని రోజులు లాక్డౌన్ పేరుతో ఇంట్లో కూర్చుంటాం. నలుగురు కలిసి పనిచేస్తేనే పన్లవుతాయి.

భౌతిక దూరం పాటిస్తూ పనులు చేయడమంటే అయ్యే పనికాదు. మాస్కులంటే పెట్టుకోవచ్చు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించొచ్చు. ఇక ఈ టాబ్లెట్ వేసుకుని భౌతిక దూరం కనీసం 2 అడుగులు పాటిస్తూ పని చేసుకుంటే సరిపోతుందని తెలిపారు. హై-స్పీడ్ కెమెరాల ద్వారా తుంపర్లు గాల్లోకి ప్రయాణించే తీరును పరిశీలించారు. తుమ్మినప్పుడు తుంపర్లు ఎక్కువ దూరం వెళ్లకపోవడాన్ని గమనించారు. వ్యాక్పిన్ వచ్చేంత వరకు ఇలాంటి ఉపశమనాలు కొంతవరకైనా కరోనా వ్యాప్తిని కట్టడి చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story