ఢిల్లీ ప్రజల అభిప్రాయాలు కేంద్రానికి చెప్పిన కేజ్రీవాల్

ఢిల్లీ ప్రజల అభిప్రాయాలు కేంద్రానికి చెప్పిన కేజ్రీవాల్
X

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేంద్రానికి పలు కీలక సూచనలు చేశారు. లాక్ డౌన్ తో పూర్తిగా కుదేలైన ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలా.. అదే సమయంలో కరోనాను కట్టడి చేసేందుకు తీసుకోవలసిన చర్యలకు ఢిల్లీ ప్రజల సలహాలు, సూచనలు కావాలని కేజ్రీవాల్ ఇటీవల ప్రకటించారు. దీనికి పెద్ద ఎత్తున్న స్పందించిన ఢిల్లీ ప్రజలు పలు సూచనలు చేశారు. ఇవే అంశాలు అరవింద్ కేజ్రీవాల్ కేంద్రం ముందు ఉంచారు. మార్కెట్లు, మార్కెట్ కాంప్లెక్స్‌లు తెరవాలని ఢిల్లీ మార్కెట్ అసోసియేషన్లు కోరుకుంటున్నాయని కేజ్రీవాల్ చెప్పారు. బేసి-సరి పద్ధతిలో రోజు మార్చి రోజు సగం దుకాణాలు తెరవాలని సూచించారని చెప్పారు. అటు, రెడ్‌జోన్లు లేని ప్రాంతాలలో హోటళ్లు మూసివేసి.. హోం డెలివరీ మాత్రమే చేసేలా రెస్టారెంట్లు తెరవాలని ఢిల్లీ ప్రజలు సూచించారని ఆయన తెలిపారు. బార్బర్ షాపులు, స్పా‌లు, సెలూన్లు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్ తెరవకూడదని.. ఢిల్లీ ప్రజానికం మొత్తం కోరుకుంటున్నారు. వేసవి సెలవులు అయిపోయే వరకూ పాఠశాలలు, విద్యాసంస్థలు మూసి ఉంచాలని చాలామంది సూచించారని కేజ్రీవాల్ చెప్పారు. లాక్‌డౌన్ కొనసాగించాలని ఎక్కువ మంది ఢిల్లీ వాసులు కోరుకుంటున్నారని అన్నారు.

Next Story

RELATED STORIES