పది పరీక్షల టైమ్ టేబుల్ వచ్చేసింది.. షెడ్యూల్ ఛేంజ్

పది పరీక్షల టైమ్ టేబుల్ వచ్చేసింది.. షెడ్యూల్ ఛేంజ్

పదవ తరగతి పరీక్షల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లుగా మార్చింది. ప్రతి సబ్జెక్టుకు వన్, టూ అని పేపర్లు ఉండేవి. వాటిని రోజుకి ఒకటి చొప్పున నిర్వహించేవారు. వైరస్ నిరోధానికి చర్యలు తీసుకుంటున్న తరుణంలో అన్ని రోజులు పరీక్షల నిర్వహణ అసాధ్యం అని భావించి విద్యార్థుల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భౌతిక దూరం కచ్చితంగా పాటిస్తూ జూలై 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి పేపర్‌కు 100 మార్కులు ఉంటాయి. ఈ మేరకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది.

జులై 10 - ఫస్ట్ లాంగ్వేజ్ (9.30am - 12.45pm)

జులై 11 - సెకండ్ లాంగ్వేజ్ (9.30am - 12.45pm)

జులై 12 - ఇంగ్లీషు (9.30am - 12.45pm)

జులై 13 - మ్యాథ్స్ (9.30am - 12.45pm)

జులై 14 - జనరల్ సైన్స్ (9.30am - 12.45pm)

జులై 15 - సోషల్ స్టడీస్ (9.30am - 12.45pm)

Tags

Read MoreRead Less
Next Story