చైనా కంటే భారత్‌లోనే ఎక్కువ..

కరోనా పుట్టిల్లు చైనాలోనే పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడితే భారత్‌లో మాత్రం అంతకంతకూ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే దేశంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3970. ప్రస్తుతం చైనాలో కరోనా కేసుల సంఖ్య 82,900 కాగా, భారత్‌లో మాత్రం 85,940కి చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో భారత్ 11వ స్థానంలో ఉంటే, చైనా 13వ స్థానంలో ఉంది. అయితే భారత్‌లో కరోనాతో మరణించిన వారి సంఖ్య చైనా కంటే తక్కువగా ఉండడం గమనించదగిన విషయం.
కరోనా గత ఏడాది డిసెంబర్ నెలలోనే బయటపడినా ఫిబ్రవరిలో తన ప్రతాపాన్ని చూపింది. వూహాన్‌లో విజృంభించిన కరోనా రోజుకి 2400 కేసులు నమోదు చేసింది. మార్చి మొదటి వారానికే చైనాలో 80 వేల కేసులు వెలుగు చూశాయి. ఆ సమయంలో భారత్‌లో 100 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భారత్‌లో రికవరీ రేటు 35 శాతం ఉంటోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. లాక్డౌన్‌తోనే కరోనా కేసుల సంఖ్య తగ్గించగలుగుతామని భారత్ ఆ దిశగా చర్యలు చేపడుతోంది. 4వ విడత లాక్డౌన్ కొనసాగించేందుకు ఇప్పటికే కేంద్రం సన్నద్ధమయింది. నిబంధనలు సడలిస్తూనే వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. అయినా కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com