మధ్యప్రదేశ్‌లో మరో రోడ్డుప్రమాదం.. ఐదుగురు వలసకూలీలు దుర్మరణం

మధ్యప్రదేశ్‌లో మరో రోడ్డుప్రమాదం.. ఐదుగురు వలసకూలీలు దుర్మరణం
X

కరోనా నేపథ్యంగా లాక్ డౌన్ విధించడంతో వలసకూలీల పరిస్థితి దయనీయంగా మారింది. స్వరాష్ట్రాలకు వెళ్తూ.. అనేక మంది రోడ్డు ప్రమాదాలకు గురై మరణిస్తున్నారు. ఇటీవల రైల్వేట్రాక్ పై పడుకున్న కొందరు కూలీలు రైలు ప్రమాదానికి గురై మృతి చెందగా.. శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదానికి గురై ఉత్తరప్రదేశ్ లో 23 మంది చనిపో్యారు. ఈ విషయాన్ని మరువక ముందే మధ్యప్రదేశ్ లో సాగర్ జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్ర నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్తున్న వలసకూలీల ట్రక్ బోల్తా పడింది. దీంతో ఘటణ స్థలంలోనే ఐదుగురు మృతి చెందారు. మరో 18 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని బాందాలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని సాగర్ జిల్లా ఎస్పీ మీడియాకు తెలియజేశారు.

Next Story

RELATED STORIES