50 లక్షలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు

50 లక్షలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు

కరోనా మహమ్మారి ప్రపంచదేశాల్ని కబళిస్తోంది. వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 50 లక్షలకు చేరువవుతున్నాయి. ప్రస్తుతం 48 లక్షల 5 వేల 151 కేసులు నమోదయ్యాయి. 18 లక్షల 59 వేల 438 మంది రికవరీ కాగా.. 26 లక్షల 28 వేల 994 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 3 లక్షల 16 వేల 730 మంది చనిపోయారు. అగ్రరాజ్యంలో వైరస్ ఉగ్రరూపం కొనసాగుతోంది. అమెరికాలో ఇప్పటివరకు 15 లక్షల 27 వేల 664 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 90 వేల 978 మంది చనిపోయారు. 3 లక్షల 46 వేల 389 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

రష్యాలోనూ కరోనా విలయం కొనసాగుతోంది. ఆ దేశంలో ఇప్పటివరకు 2 లక్షల 81 వేల 752 మంది వైరస్ బారిన పడ్డారు. 2 వేల 631 మంది చనిపోగా.. 67 వేల 373 మంది కోలుకున్నారు. స్పెయిన్‌లో 2 లక్షల 77 వేల 719 మందికి కరోనా సోకగా.. 27 వేల 650 మంది చనిపోయారు. 19 వేల 945 మంది కోలుకున్నారు. యూకేలో 2 లక్షల 43 వేల 695 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 34 వేల 636 మంది కోలుకున్నారు. వీటితో పాటు బ్రెజిల్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, టర్కీ, ఇరాన్ దేశాలు తొలి పది స్థానాలను ఆక్రమించాయి.

Tags

Read MoreRead Less
Next Story