బ్రెజిల్‌లో కరోనా.. 24 గంటల్లో వెయ్యి మరణాలు..

లాటిన్ అమెరికా దేశం బ్రెజిల్‌లో కరోనా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 1179 కరోనాతో మృతి చెందినట్లు దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,71,628 కాగా 17,971 మరణాలు సంభవించాయి. కాగా బ్రెజిల్‌లో గత మూడు రోజులుగా మహమ్మారి తీవ్రత ఉధృతమవుతోంది. ఈ క్రమంలో అత్యధిక కేసులు నమోదైన జాబితాలో బ్రిటన్, స్పెయిన్, ఇటలీని అధిగమించి బ్రెజిల్ మూడో స్థానానికి చేరుకుంది.
ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రయాణాలపై నిషేధం విధించే ఆలోచన ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇదిలా ఉంటే దేశంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్నా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకై ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రాక తప్పదని అధ్యక్షుడు జేర్ బోల్సోనారో వ్యాఖ్యానించారు. లాటిన్ అమెరికాలో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా పేరొందిన బ్రెజిల్‌ను తిరిగి పూర్వస్థితికి తీసుకురావడానికి కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాలని పిలుపునిస్తున్నారు. ఈ కారణం చేతనే 27 రాష్ట్రాల మధ్య, అధ్యక్షుడి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com