అంతర్జాతీయం

బాక్సర్ కుటుంబంలో 20 మంది..

బాక్సర్ కుటుంబంలో 20 మంది..
X

రష్యాలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. లైట్ వెయిట్ బాక్స్ ఖబిబ్ నుర్మగోమెడోవ్ తండ్రి అబ్దుల్‌మనావ్‌కు కరోనా సోకింది. ఆయన ఆరోగ్యం విషమించింది. వైద్యులు అతడిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కరోనా మహమ్మారి నా బంధువుల్లో చాలా మందిని పొట్టన పెట్టుకుంది. ఇప్పుడు నాన్న పరిస్థితి కూడా బాగాలేదు అని ఖబిబ్ ఆవేదన చెందుతున్నాడు. కరోనాకి పేద, గొప్ప తారతమ్యం లేదని ఎవరిని ఎప్పుడు కబళిస్తుందో చెప్పలేమని అన్నాడు. తన తండ్రికి గుండె ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు ఈ కరోనా వ్యాధి సోకడంతో తన ఆరోగ్యం మరింత క్షీణించింది అని అన్నాడు. ఆయన కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నానని చెప్పాడు. తన కుటుంబానికి చెందిన 20 మందికి కరోనా సోకడంతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పాడు.

Next Story

RELATED STORIES