ఢిల్లీలో ఇప్పుడు రోజుకు 500 కేసులే.. కానీ, భవిష్యత్‌లో వెయ్యిపైనే

ఢిల్లీలో ఇప్పుడు రోజుకు 500 కేసులే.. కానీ, భవిష్యత్‌లో వెయ్యిపైనే
X

దేశ రాజధాని ఢిల్లీలో నమోదవుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత రెండురోజులుగా వరుసగా 500కు పైగా కేసులు నమోదవుతున్నాయి. బుధవారం 534 కేసులు నమోదవ్వడంతో మొత్తం కేసులు సంఖ్య 11,088కి చేరింది. వారం రోజుల్లో కంటోన్మెంట్ జోనుల సంఖ్య 97నుంచి 66కు దిగివచ్చింది. అయినా.. కేసులు సంఖ్య మాత్రం పెరుగుతూపోవడం ఆందోళన కలిగిస్తుంది. అయితే.. రాష్ట్ర కరోనా నియంత్రణ కమిటీ చైర్మన్ డాక్టర్ ఎస్ కే సరిస్ మాట్లాడుతూ.. కేసులు మరింత పెరుగుతాయని.. రోజుకు వెయ్యికిపైగా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు. అయితే, పెరుగుతున్న కేసులకు తగ్గట్టు బాధితులకు చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నామని అన్నారు. ఢిల్లీలో ఇప్పటి వరకు 5,192 మంది డిశ్చార్జ్ అవ్వగా.. 5,720 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా కారణంగా 176 మంది ప్రాణాలు కోల్పోయారు.

Next Story

RELATED STORIES