కాలాపానీ, లిపులేఖ్ భారతీయులవే.. స్పష్టం చేస్తున్న రికార్డులు

కాలాపానీ, లిపులేఖ్ భారతీయులవే.. స్పష్టం చేస్తున్న రికార్డులు

కరోనా వ్యాప్తికి కారణం భారతీయులే అంటూ వేలెత్తి చూపుతున్న నేపాల్.. సరిహద్దు ప్రాంతాలు కలాపానీ, లిపులేఖ్‌లతో పాటు నభిధాంగ్‌లలోని మొత్తం భూమి తమదేనంటూ ఓ కొత్త వివాదాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు ఆ దేశ ప్రధాని ఓలీ. బ్రిటీష్ వారి పాలన నుంచి లిపులేఖ్ ప్రాంతం భారత్‌లో అంతర్భాగంగా ఉంది. లిపులేఖ్ రహదారిని కైలాస మానస సరోవర్ యాత్ర కోసం ఉత్తరాఖండ్ నుంచి నిర్మించారు. దీనిని రక్షణ మంత్రి రాజ్‌నాథ సింగ్ ఇటీవల ప్రారంభించారు. ఈ రహదారిపై కూడా నేపాల్ ప్రభుత్వం అభ్యంతరం చెబుతోంది.

మానస సరోవర్ సందర్శించే యాత్రికులు ఇంతకు ముందు సిక్కిం నుంచి నాథులాపాస్ మీదుగా వెళ్లే వారు. అది అతి ఎత్తైన ప్రదేశం కావడంతో యాత్రీకులు తరచూ అస్వస్థతకు గురయ్యేవారు. మరో మార్గం అవసరమని భావించిన భారత్ లిపులేఖ్ మార్గాన్ని నిర్మించింది. ఈ మార్గం ద్వారా యాత్రీకులకు వ్యవధి కూడా కలిసి వస్తుంది. ఏప్రాంతాలైతే తమవిగా నెపాల్ చెప్పుకుంటుందో ఆ భూమి మొత్తం ఉత్తరాఖండ్‌ని ధర్బులా సబ్ డివిజన్‌లో ఉన్న గర్బియాంగ్, గుంజీ గ్రామాల వారిదని పిథోర్‌గఢ్ జిల్లా దర్చులా సబ్ డివిజనల్ మేజిస్టేట్ ఏకే శుక్లా మంగళవారం స్పష్టం చేశారు.

ఇందుకు సంబంధించిన రికార్డులు కూడా ఉన్నాయన్నారు. కాలాపానీ, నభిధాంగ్‌లలో 190 ఎకరాల భూమి గర్భియాంగ్ గ్రామస్థుల పేరు మీద, లిపులేఖ్ భూమి గుంజి గ్రామస్తుల పేరు మీద రిజిస్టర్ అయి ఉందన్నారు. 1962 లో భారత్-చైనా యుద్ధానికి ముందు మా పూర్వీకులు అక్కడ పంటలు పండించేవారు. యుద్దం తర్వాత చైనాతో సరిహద్దు వాణిజ్యం రద్ధయింది. దాంతో వ్యవసాయం కూడా నిలిచిపోయింది అని గార్భియాంగ్ గ్రామస్తుడు కృష్ణ గార్బియల్ చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story