తాజా వార్తలు

లారీని ఢీకొట్టిన ఎర్టిగా కారు.. స్పాట్‌లోనే ముగ్గురు..

లారీని ఢీకొట్టిన ఎర్టిగా కారు.. స్పాట్‌లోనే ముగ్గురు..
X

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిట్యాల శివారులోని రిలయన్స్‌ బంక్‌ వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది కారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెనుక సీట్లో కూర్చున్న ముగ్గురు పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. బాధితులు తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లికి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా హైదరాబాద్‌ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఎర్టిగా కారులో మొత్తం 8 మంది ఉన్నట్లు గుర్తించారు.

Next Story

RELATED STORIES