మహారాష్ట్రలో ఒక్కరోజే 64 కరోనా మరణాలు

మహారాష్ట్రలో ఒక్కరోజే 64 కరోనా మరణాలు
X

దేశ ఆర్ధిక రాజధాని మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒక పక్క కరోనా కేసులు.. మరోవైపు కరోనా మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గురువారం ఒక్కరోజే.. 2,345 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 64 మరణాలు సంభవించాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 41,642కు చేరగా.. కరోనా మరణాల సంఖ్య 1454కు చేరింది. ప్రతీరోజు రెండు వేలకుపైగా కేసులు నమోదవ్వడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. లాక్ డౌన్ టైంలో ఇలా నమోదైతే.. లాక్ డౌన్ ఎత్తేస్తే.. పరిస్థితి ఏంటీ అని అధికారిక వర్గాలు తలలు పట్టుకుంటున్నాయి.

Next Story

RELATED STORIES