Top

ఏపీలో పాలన అంతా రివర్స్‌లో నడుస్తుంది: టీడీపీ ఎమ్మెల్యే

ఏపీలో పాలన అంతా రివర్స్‌లో నడుస్తుంది: టీడీపీ ఎమ్మెల్యే
X

ఏపీలో సీఎం జగన్ పాలన అంతా రివర్స్‌లో నడుస్తోందని అన్నారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. పెంచిన కరెంటు ఛార్జీలకు నిరసనగా.. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో.. లాంతరుతో పాదయాత్రగా వెళ్లి అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ప్రజలు కరోనా కష్టాల్లో వుంటే, దొడ్డిదారిలో కరెంటు ఛార్జీలు పెంచి.. ప్రజల నడ్డి విరిచారని అన్నారు. లాక్‌డౌన్‌లో పెంచిన కరెంట్ ఛార్జీలను రద్దుచేసి.. పాత శ్లాబులనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక, జగన్ పాలన పిచ్చితుగ్లక్ పాలనను తలపిస్తున్నదని అన్నారు ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు. విద్యుత్ ఛార్జీలు పెంచి పేదలపై పెనుభారం మోపారని విమర్శించారు.

Next Story

RELATED STORIES