రష్యాను మించి బ్రెజిల్..

అగ్రరాజ్యం అమెరికాపై తీవ్ర ప్రభావాన్ని చూపించిన కరోనా కాస్త తగ్గుముఖం పట్టిందనుకుంటే ఇప్పుడు లాటిన్ అమెరికాలోని బ్రెజిల్‌పై తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. గత నాలుగు రోజుల్లో అక్కడ వెయ్యికి పైగా కరోనా మరణాలు సంభవించాయి. దీంతో శుక్రవారం నాటికి మొత్తం మృతుల సంఖ్య 21 వేలు దాటిందని వైద్యాధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3,30,890కు చేరుకుంది. దీంతో అత్యధిక కేసులు నమోదైన జాబితాలో బ్రెజిల్ నిలుస్తోంది. మరోవైపు అధికారిక గణాంకాలను మించి కేసులు ఉంటాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా బ్రెజిల్ దేశాన్ని కొత్త కరోనా హాట్‌స్పాట్‌గా ప్రకటించింది. లాటిన్ అమెరికాలో చాలా దేశాలు కరోనా వైరస్‌తో సతమతమవుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో ఎమర్జెన్సీస్ డైరెక్టర్ మైక్ ర్యాన్ ఇటీవల పేర్కొన్నారు. ఇక అత్యధికంగా కరోనా కేసులు నమోదైన దేశాలు వరుసగా చూస్తే.. అమెరికా, బ్రిటన్, రష్యా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్. బ్రెజిల్ కొవిడ్ మరణాల సంఖ్యలో ఆరో స్థానంలో నిలిచింది.
RELATED STORIES
Viral Video: ఆకతాయి అల్లరి.. సింహం నోట్లో వేలు పెట్టాడు.. ఆ తర్వాత..
23 May 2022 12:45 PM GMT'Deer Zindagi': జీబ్రా క్రాసింగ్ వద్ద జింక.. జీవితం చాలా విలువైంది:...
20 May 2022 10:00 AM GMTBhubaneswar : పెళ్ళికి సైకిల్ పై వరుడు.. ఎందుకంటే..!
20 May 2022 5:30 AM GMTOdisha : పెళ్ళికి నో అన్న వధువు... స్పృహ తప్పి పడిపోయిన వరుడు
19 May 2022 3:15 PM GMTBengaluru: స్కూల్ విద్యార్థినుల ఘర్షణ.. బాయ్‌ఫ్రెండ్ కోసమే అంటూ...
18 May 2022 11:15 AM GMTKarnataka : మహిళా లాయర్ పై విచక్షణారహితంగా దాడి.. వీడియో వైరల్
16 May 2022 3:30 AM GMT