దేశ రాజధానిలో కరోనా కలకలం.. 24 గంటల్లో 660 కేసులు

దేశ రాజధానిలో కరోనా కలకలం.. 24 గంటల్లో 660 కేసులు
X

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కలకలం రేపుతోంది. గడిచిన 24 గంటల్లో 660 కేసులు నమోదయ్యాయని ఢిల్లీ ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,319కు చేరింది. ఇప్పటి వరకూ 5,897 మంది డిశ్చార్జ్ అవ్వగా.. 6,214 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 14 మంది మృతి చెందగా.. ఢిల్లీలో మొత్తం మృతుల సంఖ్య 208కి చేరింది. కాగా, ఢిల్లీలో వైద్యులు భవిష్యత్ లో కరోనా కేసులు మరిన్ని పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్న సంగతి తెలిసిందే.

Tags

Next Story