తమిళనాడులో మరో 710 కరోనా కేసులు

తమిళనాడులో మరో 710 కరోనా కేసులు
X

తమిళనాడులలో కరోనా రోజురోజుకీ విజృంభిస్తుంది. ప్రతీ రోజు 700కు పైగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 710 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 15,512కి చేరిందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకూ 7,491మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. ఇంకా 7,915 మంది చికిత్స పొందుతున్నారు. ఈరోజు కరోనాతో ఐదుగురు మృతి చెందగా.. ఇప్పటి వరకూ103 మంది చనిపోయారు. తమిళనాడు రాష్ట్రంలో ఇప్పటివరకూ.. 41 ప్రభుత్వ ల్యాబ్స్, 27 ప్రైవేట్ ల్యాబ్స్ లో మొత్తం 3,97,340 మందికి కరోనా టెస్టులు చేశారని ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

Next Story

RELATED STORIES