తెలంగాణలో కరోనా విజృంభణ.. కొత్తగా 52 కేసులు

తెలంగాణలో కరోనా విజృంభణ.. కొత్తగా 52 కేసులు
X

తెలంగాణలో కరోనా వేగంగా విస్తరిస్తుంది. రోజు రోజుకు కేసులు సంఖ్య పెరుగుతోంది. ఎక్కవ కేసులు హైదరాబాద్ లో నమోదవ్వడంతో నగరవాసులు భయాందోళనలకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో 52కేసులు నమోదయ్యయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 1813కు చేరిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈరోజు నమోదైన కేసుల్లో 33 కేసులు హైదరాబాద్ పరిదిలోనే ఉన్నాయి. మరో 19కేసులు వలస కూలీలకు సోకినట్టు గుర్తించారు. కాగా, శనివారం కరోనాతో ఒకరు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 49కి చేరింది. ఈరోజు 25 మంది డిశ్చార్జ్ అవ్వగా.. ఇప్పటి వరకూ 1,068 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక, ప్రస్తుతం 696 మంది చికిత్స పొందుతున్నారు.

ttttt

Next Story

RELATED STORIES