మహారాష్ట్రలో హత్యకు గురైన మరో సాధువు

మహారాష్ట్రలో హత్యకు గురైన మరో సాధువు
X

మహారాష్ట్రలో మరోసాధువు హత్యకు గురైయ్యారు. నాందేడ్ ఆశ్రమంలో శివాచార్య అనే సాధువుతో పాటు భగవాన్ షిండే అనే వ్యక్తి కూడా హత్య చేయబడ్డాడు. స్నానాల గదిలో ఉన్న రెండు మృత దేహాలను చూసిన పోలీసులు వారిని గొంతు కసి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. హంతకుడు వారిని హత్య చేసి డబ్బు, బంగారం కూడా దోచుకొని పోయాడు. హంతకుడుని స్థానికులు చూసి పట్టుకునేందుకు ప్రయత్నించినా.. తప్పించుకున్నాడు. అయితే, మహారాష్ట్రలో పాలఘర్ లో ఇద్దరు సాదువులు హత్యకు గురైన కొన్ని రోజుల్లోనే మరో హత్య జరగడం కలకలం రేపుతోంది. మహారాష్ట్రలో సాధువులకు రక్షణ లేకుండా పోతుందని.. బీజేపీ ఆరోపిస్తుంది.

Next Story

RELATED STORIES