ఏపీ విద్యార్ధులకు ఏడు వస్తువులు.. బడికి వచ్చిన మొదటి రోజే..

ఏపీ విద్యార్ధులకు ఏడు వస్తువులు.. బడికి వచ్చిన మొదటి రోజే..

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులు ప్రైవేటు కాన్వెంట్లలో చదివే విద్యార్థులకు ఏ మాత్రం తీసిపోనివిధంగా ఉండాలని ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే 2020-21 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10 వతరగతి వరకు చదివే విద్యార్థులకు 7 రకాల వస్తువులను కానుకగా అందించనుంది. వీటన్నింటినీ కలిపి కిట్ రూపంలో ప్రతి విద్యార్థికి అందజేస్తారు. ఈ వస్తువులను విద్యార్థులకు అందించేందుకు సమగ్ర శిక్ష అభియాన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బస్సుల్లో వచ్చే విద్యార్థులకు ఉచిత ప్రయాణాన్ని అందిస్తున్నారు. విద్యార్థులకు ఇంగ్లీషు మీడియంలో తరగతులు నిర్వహిస్తున్నా తెలుగు తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది.

విద్యార్ధులకు అందించే 3 జతల యూనిఫామ్‌కి సంబంధించిన వస్త్రం, బెల్టు, ఒక జత షూ, రెండు జతల సాక్స్, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, స్కూల్ బ్యాగ్ అందిస్తారు. యునిఫామ్ కుట్టుకూలీ కింద ఒక్కో జతకు రూ. 40 చొప్పున అకౌంట్‌లో జమ చేస్తారు. ఏపీ ప్రభుత్వం విద్యాకానుక కింద రూ.650.60 కోట్లను ఖర్చు చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story