మద్యం ప్రియులంటే మహా ఇష్టం కరోనాకి.. మరి మీరు..

మద్యం ప్రియులంటే మహా ఇష్టం కరోనాకి.. మరి మీరు..

మద్యం ప్రియులకు బుద్ది మందగిస్తుందో లేదో తెలియదు కానీ రోగనిరోధక శక్తి మాత్రం మందగిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. కరోనా కట్టడిలో కీలక పాత్ర వహించే రోగ నిరోధక శక్తి మద్యం తాగే వారిలో సన్నగిల్లుతుందని అంటున్నారు పరిశోధకులు. మద్యం శరీరంలోని అన్ని అవయవాలు, కణాల మీద దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక రోగనిరోధక వ్యవస్థ కణాలను మాత్రం ఎందుకు వదిలేస్తుంది.

ఊపిరితిత్తుల్లోకి హానికార క్రిములు ప్రవేశించకుండా అడ్డుకునే రోగనిరోధక కణాల వ్యవస్థను అది దెబ్బతీస్తుంది. కరోనా వైరస్ వంటి క్రిములు తేలికగా లోపలికి ప్రవేశించమంటూ మందు బాబులు ఆహ్వానం పలుకుతారు. మద్యం తాగేవారిలో ఊపిరితిత్తుల కణజాలంతో పాటు పేగుల్లోని సున్నితమైన పొర సైతం దెబ్బతింటుంది. ఇవన్నీ ఇన్ఫెక్షన్ల ముప్పును, తీవ్రతను పెంచుతాయి. దాంతో ఏ వైరస్ అయినా త్వరగా అటాక్ చేస్తుంది మందు బాబుల్ని. అందుకు కరోనా వైరస్ మినహాయింపు కాదు.

Tags

Read MoreRead Less
Next Story