అదృష్టం.. అందమైన లక్షద్వీప్‌లో కరోనా కేసు ఒక్కటీ..

అదృష్టం.. అందమైన లక్షద్వీప్‌లో కరోనా కేసు ఒక్కటీ..
X

అందమైన ఆ లక్షద్వీపులను చూస్తే కరోనాకి కాలు పెట్టాలనిపించలేదేమో. అందుకే అక్కడ ఒక్క పాజిటివ్ కేసూ నమోదు కాలేదు. పచ్చని చెట్లు, చుట్టూ సముద్రం. ప్రకృతి తన అందాన్నంతా అక్కడే దాచుకున్నట్టు కనిపించే వాతావరణం. 36 ద్వీపాలతో కూడిన అందమైన ద్వీప సముదాయం లక్షద్వీప్. ఇక్కడి మొత్తం జనాభా 64 వేల మంది మాత్రమే. కేరళ తీరం వెంబడి ఉన్న ఈ కేంద్రపాలిత ప్రాంతం.. దాని అవసరాల కోసం దక్షిణాది రాష్ట్రాలపై ఆధారపడుతుంది.

భారత దేశంలోని అతి చిన్న కేంద్ర భూభాగం లక్షద్వీప్ 32 ద్వీపాలతో 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఒక ద్వీపసమూహం. ఈ ద్వీప రాజధాని కవరట్టి. అన్ని ద్వీపాలు అరేబియా సముద్రంలో కేరళ లోని తీర నగరమైన కొచ్చి నుండి 220 నుండి 440 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. సహజ సుందరమైన ప్రకృతి దృశ్యాలు, ఇసుక బీచ్‌లు, పచ్చని చెట్లు, స్వేచ్ఛగా విహరించే జంతు జాలం, అక్కడి మనుషుల ప్రశాంతత, హడావిడి లేని వారి జీవన శైలి చూసి కరోనాకి కూడా లక్షద్వీప్‌లోకి ఎంటరవ్వాలనిపించలేదేమో. అందుకే ఒక్క కేసూ లేదు. బిఎస్ఎన్ఎల్, ఎయిర్‌టెల్ మాత్రమే లక్షద్వీప్ దీవులకు టెలికమ్యూనికేషన్ సేవలను అందిస్తున్నాయి.

Next Story

RELATED STORIES