బ్రేకింగ్... కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టుకు హాజరైన ఏపీ సీఎస్..

X
TV5 Telugu28 May 2020 12:52 PM GMT
కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టుకు హాజరయ్యారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని. ఆమెతో పాటు.. పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ కూడా హైకోర్టుకు హాజరయ్యారు. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసిన అంశంపై ఉన్నతాధికారులు నీలం సాహ్ని, ద్వివేది, గిరిజా శంకర్ హైకోర్టుకు హాజరవ్వాల్సి వచ్చింది. తమ ఆదేశాలు బేఖాతరు చేశారని భావించిన న్యాయస్థానం... కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేయడంతో ముగ్గురు ఉన్నతాధికారులు హైకోర్టు ముందు హాజరయ్యారు.
Next Story