కేరళలో కొత్తగా 40 కరోనా కేసులు.. కానీ ఎక్కువ మంది..

కేరళలో కొత్తగా 40 కరోనా కేసులు.. కానీ ఎక్కువ మంది..
X

కేరళలో కరోనా విజృంభిస్తుంది. బుధవారం 40 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 1004కి చేరాయని.. కేరళ సీఎం పినరయ్ విజయన్ తెలిపారు. అయితే, ఇటీవల నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా.. ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రం లోకి వచ్చిన వారే కావడం గమనార్హం.. తాజాగా నమోదైన కేసులలో కూడా 9 మంది ఇతర దేశాల నుంచి వచ్చిన వారు కాగా.. మహారాష్ట్ర నుంచి వచ్చిన వారు 16 మంది.. తమిళనాడు నుంచి వచ్చిన వారు 5 మంది, ముగ్గురు ఢిల్లీ నుంచి, ఏపీ, యూపీ, కర్ణాటక, తెలంగాణ నుంచి వచ్చిన ఒక్కొక్కరుగా ఉన్నట్టు తెలిపారు. ఇతరుల వల్ల మరో ముగ్గురికి కరోనా సోకినట్లు చెప్పారు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు మాత్రం 445 మంది మాత్రమే. బయట నుంచి వచ్చిన వారిలోనే ఎక్కువగా కరోనా బయటపడుతోందని సీఎం పినరయ్ విజయన్ అన్నారు.

Next Story

RELATED STORIES