ప్రైవేట్ ఆస్పత్రులపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రైవేట్ ఆస్పత్రులపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు
X

ప్రభుత్వం నుంచి ఉచితంగా భూములు పొందిన ప్రైవేట్ ఆస్పత్రులు.. కరోనా రోగులకు ఎందుకు ఉచితంగా చికిత్స చేయవు అని సుప్రీంకోర్డు ప్రశ్నించింది. కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఎక్కువగా ఇబ్బందులకు గురవుతున్నది వలసకార్మికులే.. వారి సమస్యలపై సుప్రీం కోర్టు స్వీయ విచారణ జరుపుతోంది. ఇందులో బాగంగా ప్రభుత్వం నుంచి ఉచితంగా భూములు పొందిన ప్రైవేట్ ఆస్పత్రులు ఇలాంటి ఆపత్కర సమయంలో రోగులకు ఎందుకు ఉచితంగా చికిత్స అందించరాదు అని ప్రశ్నిచింది. దీనిపై కేంద్రం వారం రోజుల్లో సమాధానం చెప్పాలి అని నోటీసులు జారీ చేసింది. అలా ఉచితంగా చికిత్స అందించే ఆస్పత్రుల వివరాలు తెలిపాలని ఆదేశించింది. వలస కార్మికులు విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నాయని ఉన్నత న్యాయస్థానం మండిపడింది.

Next Story

RELATED STORIES