సినిమా షూటింగ్‌లపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం: మంత్రి తలసాని

సినిమా షూటింగ్‌లపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం: మంత్రి తలసాని
X

టాలీవుడ్ సినీ ప్రముఖులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో మరోసారి సమావేశమయ్యారు. నిర్మాతలు సి. కళ్యాణ్‌, దిల్ రాజు, డైరెక్టర్ ఎన్. శంకర్, మా అధ్యక్షుడు నరేష్‌, FDC మాజీ చైర్మన్ రామ్మోహన్‌ రావు, జీవితతో పాటు పలువురు నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ సమావేశంలో పాల్గొన్నారు. సినిమా షూటింగ్‌లు, థియేటర్ల ఓపెనింగ్ వంటి అంశాలపై చర్చించారు. లాక్‌డౌన్‌తో సినిమా, టీవీ రంగాలపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని మంత్రికి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి శ్రీనివాస్ యాదవ్.. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్‌కు అనుమతి ఇచ్చామని.. షూటింగ్‌లు, థియేటర్ల ఓపెనింగ్‌పై చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Next Story

RELATED STORIES