ఈ సమయంలో ప్రభుత్వాన్ని అస్థిర పరిచే ఆలోచనలేదు: దేవేంద్ర ఫడ్నవీస్

ఈ సమయంలో ప్రభుత్వాన్ని అస్థిర పరిచే ఆలోచనలేదు: దేవేంద్ర ఫడ్నవీస్

మహారాష్ట్రలో తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆలోచన లేదని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ప్రస్తుతం దేశం కరోనాతో క్లిష్ట పరిస్థితుల్లో ఉందని.. కనుక, తాము దానితో పోరాడుతున్నామని అన్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కానీ, రాష్ట్రపతి పాలన విధించాలని కానీ తమకు లేదని అన్నారు. ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వ అస్థిరతను తాము కోరుకోవడంలేదని స్పష్టం చేశారు. దేశంలో ఉన్న కరోనా కేసుల్లో 36 శాతం మహారాష్ట్ర నుంచే నమోదవుతున్నాయని.. ఉద్ధవ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో లోపాల కారణంగానే కరోనా ఈ స్థాయిలో విజృంభిస్తుందని అన్నారు. ముంబైలో కరోనా రోగుల కోసం ఆస్పత్రులు, అంబులెన్సులు కూడా అందుబాటులో లేదని.. రోడ్ల మీదే.. రోగులు చనిపోతున్నారని మండిపడ్డారు. ముంబైలో లాక్ డౌన్ సరిగా అమలు కావడంలేదని అన్నారు. మూడు కోట్లమందికి రేషన్ కార్డులు ఉన్నా.. అందరికీ మార్చి, ఏప్రిల్ లో రేషన అందలేదని మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story