జే గ్యాంగ్ ఏపీలోని భూములన్నీ కొట్టేస్తోంది: నారా లోకేష్

జే గ్యాంగ్ ఏపీలోని భూములన్నీ కొట్టేస్తోందని ఆరోపించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. పేదలకు సెంట్ భూమి పేరుతో వైసీపీనేతలు అద్భుతమైన స్కామ్‌కు స్కెచ్ వేశారన్నారు. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో భూములు లాక్కుంటున్నారన్నారు. విశాఖలో ఏడు నెలల్లోనే విజయసాయిరెడ్డి అనేక భూఅక్రమాలు చేశారన్నారు. వెయ్యి కోట్ల విలువైన వాల్తేరు భూమితో పాటు దసపల్లా భూములను ఆక్రమించుకున్నారన్నారు. ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్న వైజాగ్‌లో 500 భూకబ్జా కేసులు నమోదయ్యాయన్నారు లోకేష్.
కేవలంలో మద్యంలోనే 5వేల కోట్లు రూపాయల జగన్‌రెడ్డి ట్యాక్స్ రాబట్టారని ఆరోపించారు లోకేష్. పేదల ప్రజల నెత్తురును మద్యం రూపంలో తాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ నిర్వాకం వల్ల భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. కరోనా విషయంలోనూ అలసత్వం వహించారన్నారు. శానిటైజర్లు, మాస్కుల, టెస్టింగ్ కిట్లలోనూ భారీ అవినీతి జరిగిందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com