యూఏఈలో ఒక్కరోజే 563 కొత్త కేసులు..

X
TV5 Telugu29 May 2020 4:11 PM GMT
గల్ఫ్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ప్రతి రోజు భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఒక్కరోజే 563 కొత్త కేసులు నమోదయినట్లు యూఏఈ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దేశంలో కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 32,532కి చేరింది. ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడిన ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3.62 లక్షల మంది కాగా, పాజిటివ్ కేసులు 59 లక్షల వరకు నమోదయ్యాయి.
Next Story