తాజా వార్తలు

‘స్పీకప్‌ ఇండియా’ పేరుతో సోషల్ మీడియాలో పోరాటం చేస్తాం: ఉత్తమ్

‘స్పీకప్‌ ఇండియా’ పేరుతో సోషల్ మీడియాలో పోరాటం చేస్తాం: ఉత్తమ్
X

కరోనా వ్యాప్తి కారణంగా ఇబ్బందులు పడుతున్నపేదల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌. కార్మికుల భద్రత, ఆహారం, వసతి, రవాణా సౌకర్యం కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. దీనిపై ‘స్పీకప్‌ ఇండియా’ పేరుతో సోషల్ మీడియా పోరాటం చేస్తామన్నారాయన. ఏఐసీసీ పిలుపు మేరకు ఈ అన్‌లైన్‌ పోరాటంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొంటున్నారన్నారు ఉత్తమ్.

దేశంలోనే అత్యంత తక్కువ కరోనా పరీక్షలు జరిగింది ఒక్క తెలంగాణలోనేనన్నారు ఉత్తమ్‌. రోజుకు 5 వేల కరోనా పరీక్షలు నిర్వహిస్తామన్న మంత్రి ఈటల రాజేందర్‌.. ఆ దిశగా ఎందుకు కరోనా పరీక్షలు చేయడంలేదో చెప్పాలని ప్రశ్నించారు. హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా కరోనా పరీక్షల విషయంలో ప్రభుత్వం తీరుమార్చుకోవడం లేదన్నారు ఉత్తమ్‌.

Next Story

RELATED STORIES