తాజా వార్తలు

బాసర ట్రిపుల్‌ ఐటీ కాలేజీలో అగ్ని ప్రమాదం

బాసర ట్రిపుల్‌ ఐటీ కాలేజీలో అగ్ని ప్రమాదం
X

నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ ఐటీ కాలేజీలో అగ్ని ప్రమాదం జరిగింది. తరగతి గదిలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో ఈ ప్రమాదం జరిగింది. కళాశాలలోని ఫ్యాకల్టీ సిబ్బంది.. ఉదయం ఐదు గంటల సమయంలో మార్నింగ్‌ వాక్‌కు వెళ్లగా.. ఏబీ వన్‌ క్లాస్‌లోమంటలు రావడం చూశారు. దీంతో సెక్యూరిటీని అప్రమత్తంగా చేశారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న బైంసా అగ్నిమాపక సిబ్బంది.. అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పేశారు.

ఈ ప్రమాదంలో ఫర్మీచర్‌, ప్రొజెక్టర్‌తో పాటు 70 కుర్చీలు, 21 టేబుళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రెండు నెలల నుంచి గదిలోని కరెంట్‌ స్విచ్చాఫ్‌ చేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గతంలోనూ ఫైర్‌ యాక్సిడెంట్‌ జరిగింది. అయినా.. అధికారుల్లో మాత్రం ఎలాంటి చలనం కనిపించడం లేదు. ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Next Story

RELATED STORIES