లాక్‌డౌన్‌ 5.0లో అనుమతులు ఉన్నవి.. లేనివి ఇవే..

లాక్‌డౌన్‌ 5.0లో అనుమతులు ఉన్నవి.. లేనివి ఇవే..
X

కేంద్రం మరోసారి లాక్ డౌన్ జూన్‌ 30 వరకు పొడిగించింది. అయితే, కేవలం కంటైన్‌మెంట్‌ జోన్ల వరకే పరిమితం చేసింది. అయితే, రాత్రి పూట కర్ఫ్యూ సమయం మార్చింది. కొత్త నిబంధనల ప్రకారం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. దీనికి అనుగుణంగా కేంద్రం లాక్‌డౌన్‌ 5.0కు జారీచేసింది

అనుమతి లేనివి

* మెట్రో రైలు సేవలు అనుమతి లేదు.

* అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనుమతి లేదు.

* సినిమా హాల్స్‌, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌ కు అనుమతి లేదు.

* పార్కులు, బార్లు, రాజకీయ, సామాజిక, క్రీడా కార్యక్రమాలు అనుమతి లేదు.

అనుమతులు ఇచ్చినవి

* ఇరు రాష్ట్రాల ఒప్పందంతో.. అంతర్రాష్ట్ర రవాణాకు కొనసాగించవచ్చు

* ప్రయాణికుల రైళ్లు అనుమతి ఇచ్చారు. శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లు సేవలు కొనసాగుతాయి.

* దేశీయ విమాన ప్రయాణాలకు అనుమతి.

* విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల తరలింపు కొనసాగుతుంది.

* దేవాలయాలు, ప్రార్థనా మందిరాలకు జూన్‌ 8 నుంచి అనుమతిచ్చింది.

* హోటళ్లు, రెస్టారెంట్లు, ఆతిథ్య సేవలు, షాపింగ్‌ మాల్స్‌కు అనుమతిచ్చింది.

రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలతో చర్చించి పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు తెరవడంపై నిర్ణయం తీసుకుంటామని కేంద్రం ప్రకటించింది. దీనిపై జులైలో నిర్ణయం తీసుకుంటామని కేంద్రం పేర్కొంది.

Next Story

RELATED STORIES