కిషన్ గంగా, రాట్లే ప్రాజెక్టుల పనులు భారత్ ఆపాలి: పాక్

కిషన్ గంగా, రాట్లే ప్రాజెక్టుల పనులు భారత్ ఆపాలి: పాక్

కశ్మీర్‌లో జీలం, ఛీనాబ్ నదులపై కిషన్ గంగా, రాట్లే ప్రాజెక్టుల పనులను భారత్ నిలిపివేయాలని పాక్ పార్లమెంటరీ కమిటీ ఓ తీర్మానాన్ని చేసింది. సింధూ నదీ జలాల ఒప్పందం ఆధారంగా ఈ సమస్యను పరిస్కరించడానికి ప్రపంచ బ్యాంకు ఓ కోర్టును ఏర్పాటు చేయాలని కూడ కోరింది. సింధూ నదీ జలాల ఒప్పందానికి ప్రపంచ బ్యాంకే మధ్యవర్తిత్వం వహించింది కనుక ఈ సమస్యను కూడా పరిస్కరించాల్సిన బాధ్యత ప్రపంచ బ్యాంక్ పై ఉందని వ్యాఖ్యానించింది. ఈ కోర్టు ఏర్పాటయ్యే వరకూ.. భారత్ ప్రాజెక్టుల నిర్మాణ పనులను నిలిపివేయాలని తీర్మానంలో పాక్ డిమాండ్ చేసింది. ఇక సింధూ జలాలకు విషయంలో భారత్, పాక్ ల మధ్య గత కొంత కొన్నిదశాబ్ధాలుగా విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story