అంతర్జాతీయం

క్యాన్సర్ చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్తే కరోనా..

క్యాన్సర్ చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్తే కరోనా..
X

మాజీ బాక్సర్ డింకో క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని కుటుంబసభ్యులు కలవరపడుతున్నారు. 2017 నుంచి ఆసియాడ్ స్వర్ణ పతక విజేత డింకోసింగ్ కాలేయ క్యాన్సర వ్యాధితో బాధపడుతున్నాడు. లాక్డౌన్ సమయంలో రేడియేషన్ చికిత్స కోసం మణిపూర్ నుంచి ఢిల్లీకి ఎయిర్ అంబులెన్స్‌లో వెళ్లారు. చికిత్స అనంతరం మణిపూర్ బయల్దేరే ముందు వైద్య సిబ్బంది కరోనా టెస్ట్ చేశారు అక్కడ నెగెటివ్ అని వచ్చింది. కానీ మణిపూర్ వచ్చిన తరువాత మళ్లీ ఒకసారి పరీక్షలు జరిపడంతో పాజిటివ్ అని వచ్చింది. దీంతో కలవరపాటుకు గురైన కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రిలో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు.

Next Story

RELATED STORIES