గుజరాత్ నుంచి కరోనా ఢిల్లీకి, ముంబైకి పాకింది: శివసేన నేత

గుజరాత్ నుంచి కరోనా ఢిల్లీకి, ముంబైకి పాకింది: శివసేన నేత
X

నమస్తే ట్రంప్‌ కార్యక్రమంతోనే.. గుజరాత్‌లో కరోనా వ్యాప్తి చెందిందని ఆరోపించారు శివసేన సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమం వల్లే ముంబై, ఢిల్లీ లాంటి నగరాలకు కరోనా పాకిందన్నారు. ముందస్తు వ్యూహం లేకుండా లాక్‌డౌన్ విధించారని, ఇప్పుడు నిబంధనల సడలింపులను రాష్ట్రాలకే వదిలేస్తున్నారని మండిపడ్డారాయన. గుజరాత్‌లో జరిగిన ట్రంప్ కార్యక్రమం వల్లే కరోనా వ్యాప్తి చెందిందన్న విషయాన్ని తోసిపుచ్చలేమన్నారాయన. కరోనాను అరికట్టడంలో విఫలమయ్యామని మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ డిమాండ్ చేస్తోందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం కరోనాను అరికట్టడంలో విఫలమయ్యాయరన్నారు. సాక్షాత్తు కేంద్రమే కరోనా నియంత్రణలో విఫలమైందని ఆరోపించారు సంజయ్‌ రౌత్‌.

మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తోందన్నారు సంజయ్‌ రౌత్‌. అయితే దౌర్భాగ్యం కొద్దీ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారాయన. సంకీర్ణంలో పొరపొచ్చాలున్నప్పటికీ.. బలవంతంగానైనా ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సంకీర్ణ పక్షాలపై ఉందని ఆవేదన వ్యక్తం చేశారు సంజయ్‌ రౌత్‌.

Next Story

RELATED STORIES