కరోనాకు తోడు.. రక్తం పీల్చే కీటకాలు.. రష్యా అతలాకుతలం

కరోనాకు తోడు.. రక్తం పీల్చే కీటకాలు.. రష్యా అతలాకుతలం

కరోనా వేగంగా విజృంభిస్తున్న రష్యాలో మరో ఉపదృవం వచ్చిపడింది. కరోనా కేసుల్లో ప్రపంచంలో రష్యా మూడోస్థానంలో ఉంది. దీంతో అధికారులు తీవ్రఆందోళనకు గురవుతున్నారు. అయితే, దీనికి తోడు.. రక్తం పీల్చే కీటకాలు రష్యా ప్రజలపై దాడి చేస్తున్నాయి. ఈ కీటకాలు సాధారణంగా సైబీరియాలో ఎక్కువగా ఉంటాయి. అయితే.. అవి ఇప్పుడు సాదారణ స్థాయి కంటే 428 రెట్లు పెరిగినట్టు రష్యా స్థానిక మీడియా వెల్లడించింది. ఇవి కుట్టి చాలా మంది అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరుతున్నారు. అయితే.. ఈ కీటకాల బారినపడిన వారు ఎక్కువగా ఉండటంతో ఆస్పత్రుల్లో వ్యాక్సిన్లు సరిపడని పరిస్థితి ఎదురవుతుంది.

Tags

Read MoreRead Less
Next Story