త్వరలో భారత్‌కు విజయ్ మాల్యా

త్వరలో భారత్‌కు విజయ్ మాల్యా

విజయ్ మాల్యాను భారత్ కు తీసుకొని వచ్చేందుకు రంగం సిద్ధమైందని.. త్వరలోనే తీసుకొని వస్తామని కేంద్రప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తనను భారత్ కు తరలించేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని యూకే సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. అయితే, అది గత నెల 24న తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే. దీంతో మాల్యాకు అన్ని దారులు మూసుకుపోయాయి. ఇక కేంద్రం లిక్కర్ కింగ్ ను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మురం చేసింది. కొద్దిరోజుల్లోనే మాల్యాను తీసుకొస్తామని కేంద్ర దర్యాప్తుసంస్థ అధికారి ఒకరు మీడియాలకు తెలిపారు. అయితే, ఏ రోజున తీసుకొని వస్తారు అనేదానికి సమాధానం చెప్పలేదు. వచ్చిన వెంటనే మాల్యాను కస్టడీలోకి తీసుకుంటామని సీబీఐ తెలిపింది. కాగా.. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కోసం బ్యాంకుల్లో 9వేల కోట్లు లోన్ తీసుకున్న విజయ్ మాల్యా అప్పులు తీర్చకుండా ఎగ్గొట్టారనే అభియోగాలు ఎదుర్కొంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story