మహమ్మారి గురించి ముందే హెచ్చరించాం: చైనా

మహమ్మారి గురించి ముందే హెచ్చరించాం: చైనా

వూహాన్‌లో పుట్టిన కరోనా వైరస్ మహమ్మారి గురించి ముందే ఎందుకు హచ్చరించలేదని అమెరికా ముందు నుంచి చైనాపై విరుచుకు పడుతోంది. అయితే ఈ వార్తలో ఎంత మాత్రం నిజం లేదని చైనా తెలిపింది. విదేశాంగశాఖ అధికారి జావో లిజియాన్ బుధవారం మీడియాతో ఇదే విషయమై మాట్లాడారు. వైరస్ గురించి డబ్ల్యుహెచ్‌వోకు సమాచారం అందించడంలో జాప్యం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే అసోసియేటెడ్ ప్రెస్ కూడా డబ్ల్యుహెచ్‌వో నిరాశకు గురైందని, ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు, రికార్డుల ద్వారా తమకు అనేక విషయాలు తెలిసాయని పేర్కొంది. కానీ డబ్ల్యుహెచ్‌వో వైరస్ సమాచార విషయంలో చైనాను ఎప్పుడూ తప్పు పట్టలేదు. పైగా ప్రశంసిస్తూ వచ్చింది. ఈ కారణంతోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ డబ్ల్యుహెచ్‌వో మీద చిందులు తొక్కారు. చైనా చేసిన పనికి తప్పు పట్టాల్సింది పోయి వత్తాసు పలుకుతారా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థకు ఇచ్చే నిధులు కూడా మళ్లిస్తామన్నారు. డబ్ల్యుహెచ్‌వో చైనాకు అనుకూలంగా పని చేస్తుందని ట్రంప్ నిత్యం విమర్శలు చేస్తూనే ఉంటారు.

Tags

Read MoreRead Less
Next Story