ఎయిమ్స్‌లో 480 మందికి కరోనా..

ఎయిమ్స్‌లో 480 మందికి కరోనా..
X

దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ప్రతిష్టాత్మక వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్‌‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకు ఎక్కువవుతోంది. ఇప్పటి వరకు నమోదైన కేసులు 480 కాగా, అందులో 19 మంది డాక్టర్లు, 38 మంది నర్సులు, 14 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 74 మంది భద్రతా సిబ్బంది, 75 మంది అటెండర్లు, 54 మంది శానిటేషన్ సిబ్బంది ఉన్నారు. ఇప్పటి వరకు ఐదుగురు పేషెంట్లు కరోనాతో మరణించారు. ఇంకా ఇక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు కరోనా బారిన పడగా వారిని క్వారంటైన్‌కు తరలించారు.

ఎయిమ్స్‌ చరిత్రలో మొట్ట మొదటి సారి మార్చినెలలో ఔట్ పేషెంట్ విభాగాన్ని మూసివేయండం.. కరోనా భయానికి అలా చేయవలసి వచ్చిందని అధికారులు తెలిపారు. డాక్టర్లు, నర్సులకు కరోనా పాజిటివ్ రావడంతో నగరంలోని హిందూరావు హాస్పిటల్, బాబు జగ్జీవన్ రామ్ మెమోరియల్ హాస్పిటల్, ఢిల్లీ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌ను ఏప్రిల్ నెలలో సీజ్ చేశారు. వైద్య సిబ్బందికి కరోనా సోకడం ఎయిమ్స్ యాజమాన్యాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.

Next Story

RELATED STORIES