దావూద్ ఇబ్రహీంకు కరోనా?

X
TV5 Telugu5 Jun 2020 7:06 PM GMT
అండర్ వరల్డ్ డాన్, ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం కరోనా సోకినట్టు తెలుస్తుంది. దీంతో ఆయనకు కరాచీ సమీపంలోని మిలటరీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. ముందు ఆయన భార్యకు మెహజీబెన్‌కు కరోనా పరీక్షల్లో పాజిటీవ్ అని తేలగా.. తరువాత దావూద్ కు కూడా పరీక్షలు జరిపించారు. దీంతో ఆయనకు కూడా కరోనా సోకినట్టు తెలుస్తుంది. దావుద్ తో పాటు.. ఆయన వ్యక్తిగత సిబ్బందిని క్వారంటైన్కు తరలించారని అంటున్నారు. దీనిపై స్పందించిన పాక్ మీడియా ఇవన్నీ అబద్దపు వార్తలుగా తీసిపడేస్తుంది. 1993లో జరిగిన ముంబై వరుస బాంబ్ పేలుళ్ల కేసులో దావుద్ ఇబ్రహీం కీలక సూత్రదారిగా ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
Next Story