విజయ్ చిత్రం 'మాస్టర్' ని విడుదల చేయనివ్వకండి : సీఎంకు దర్శకుడి లేఖ

విజయ్ చిత్రం మాస్టర్ ని విడుదల చేయనివ్వకండి : సీఎంకు దర్శకుడి లేఖ
X

తమిళ్ సూపర్ స్టార్ విజయ్ చిత్రం వస్తుందంటే అభిమానులకు పండగే. ఈ చిత్రం కోసం రెండు నెలల నుంచి ఎదురు చూస్తున్నారు. ముందు నిర్ణయించిన డేట్ ప్రకారం ఏప్రిల్ 9న విడుదల కావల్సి ఉంది. కానీ లాక్డౌన్ కారణంగా చిత్రం విడుదల వాయిదా పడింది. మాస్టర్ చిత్రంలో విజయ్ కథానాయకుడిగా, విజయ్ సేతుపతి విలన్ గా నటించారు. లాక్డౌన్ కారణంగా నష్టాల్లో కూరుకుపోయిన తమను మాస్టర్ చిత్రం కాపాడుతుందని యాజమాన్యం భావిస్తోంది. అందుకే లాక్డౌన్ ముగిసిన వెంటనే ముందుగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటోంది.

అయితే ఇది ఎంత మాత్రం మంచి నిర్ణయం కాదంటున్నారు సీనియర్ దర్శకుడు కేయార్. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఈ సినిమా కోసం వేల సంఖ్యలో అభిమానులు ఎదురు చూస్తున్నారు. విడుదలైన మొదటే అభిమానులు థియేటర్లలో సందడి చేస్తారు. దీంతో కరోనా మరింత వేగంగా వ్యాప్తి చెందుతుంది. అలా జరిగితే విజయ్ కే చెడ్డ పేరు వస్తుంది. పరిశ్రమ లాభాలకంటే, ప్రజల ప్రాణాలకే ఎక్కువ విలువ ఇవ్వాలని కేయార్ లేఖలో పేర్కొన్నారు.

Next Story

RELATED STORIES