హెచ్‌సీక్యూతో ఎటువంటి ఉపయోగాలులేవని తాజా అధ్యయనంలో వెల్లడి

కరోనా చికిత్సలో పలు దేశాలు వాడుతున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ వల్ల ఎటువంటి ఉపయోగాలు లేవని తేలడంతో బ్రిటన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శుక్రవారం హెచ్‌సీక్యూపై జరుపుతున్న ట్రయల్స్ ని నిలిపివేశారు. దీనిని ప్రపంచం మొత్తం దివ్యౌషధంగా భావిస్తున్నారని.. కానీ, దీని వలన ఎటువంటి ఉపయోగం లేదని అన్నారు. కరోనా సోకకుండా తాను ముందుగానే హెచ్‌సీక్యూ తీసుకుంటున్నాని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. దీంతో
హైడ్రాక్సీ క్లోరోక్విన్ పనితీరుపై చాలా మంది అధ్యయనాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఆక్సఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త మార్టిన్ లాండ్రే నాయకత్వంలో ఓ బృందం హెచ్‌సీక్యూపై అధ్యయనం చేసింది. దీనిలో కరోనాను ఎదుర్కొనే లక్షణాలు ఏమి లేవని ఈ అధ్యయంలో తేలినట్టు లాండ్రే చెప్పారు. ఇప్పటికైనా ప్రపంచ వైధ్యులు వారి దృక్పథం మార్చుకోవాలని అన్నారు. ఇటీవల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా హెచ్‌సీక్యూపై ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తపరిచింది. దీనితో కరోనాను అరికట్టలేమని తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com