మరోసారి భారత్‌పై మిడతల దండు!

మిడతల దండు భారత్‌ను భయపెడుతూనే ఉంది. మన దేశంలోని పంటలు పాడుచేయకుండా చాలా రాష్ట్రాలు చర్యలు చేపట్టాయి. కానీ నాలుగు రోజుల నుంచి మిడతల దండు మన దేశంలోకి రావడం ఆగిపోయింది. కానీ వాటి ముప్పు ఇంకా పోలేదు. మన దేశంపై మరోసారి దండెత్తే ప్రమాదం లేకపోలేదు. జూలై నెలలో మిడతలు మరోసారి భారత్‌పై దాడి చేసే ప్రమాదం ఉందని ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ-FAO వెల్లడించింది. మిడతల భయం పోయిందని రైతులు ఊపిరి పీల్చుకునేలోపే FAO ప్రకటన... అన్నదాతలను మరింత కలవరపెడుతోంది.
మిడతలు ఇప్పటికే పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో దాడి చేసి పంటలు పాడు చేశాయి. రాజస్థాన్‌లోని బాడ్‌మేర్, జోధ్‌పూర్, మధ్యప్రదేశ్‌లోని వింధ్య, బుందేల్‌ఖండ్, గ్వాలియర్, చంబల్ ప్రాంతాల్లోని చాలా గ్రామాల్లో మిడతలు ఇప్పటికీ పంటలు నాశనం చేస్తూనే ఉన్నాయి. ఈ విషయాన్ని జాతీయ మిడతల హెచ్చరిక కేంద్రం వెల్లడించింది. గత నాలుగు రోజుల నుంచి కొత్త దండు రాలేదని ఆ సంస్థ తెలిపింది. భారత్‌లోని అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని
ప్రస్తుతం కెన్యా, సొమాలియా, ఇథియోపియా దేశాల్లో మిడతలు గుడ్డు దశలో ఉన్నాయి. ఇవన్నీ జూన్ రెండో వారం నుంచి జులై రెండోవారం మధ్య రెక్కలు విచ్చుకునే దశకు చేరుకుంటాయి. ఆ తర్వాత ఇవి దండుగా మారి ఇరాన్, పాకిస్థాన్ తదితర దేశాల నుంచి భారత్‌లోకి వచ్చే ప్రమాదం ఉందని FAO తెలిపింది. ఒక్కో దండు రోజులో దాదాపు 150 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఒక చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉండే ఈ మిడతల గుంపు 35వేల మందికి సరిపడే ఆహారాన్ని తినేస్తాయని అధికారులు అంచనా వేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com